Bangladesh cricketers,led by star all-rounder Shakib Al Hasan,have called off their s@@ike over pay and benefits after getting assurance from the country's board that all their demands will be met, putting their tour of India back on track.
#bangladeshvsindia
#sheikhhasina
#shakibalhasan
#mashrafemortaza
#BangladeshcricketBoard
#Mahmudullah
#MushfiqurRahim
బంగ్లాదేశ్ ఆటగాళ్లు జీతభత్యాలు, పలు అంశాల విషయంలో బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ)పై చేస్తున్న సమ్మెను విరమించుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత బీసీబీ పెద్దలతో రెండు గంటల పాటు చేసిన సుదీర్ఘ చర్చలు సఫలం అవ్వడంతో సోమవారం నుండి చేస్తున్న నిరవధిక సమ్మెను బంగ్లా ఆటగాళ్లు విరమించుకున్నారు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ఇక బంగ్లా ప్రధాని షేక్ హసీనా చేసిన చర్చలు కూడా విజయవంతం అయ్యాయి.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పెద్దలతో చర్చలు సఫలమయ్యాయని బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్, టీ20 కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఓ ప్రకటనలో తెలిపాడు 'బుధవారం బోర్డు అధ్యక్షుడు, డైరెక్టర్లతో సమావేశమయ్యాం. మా డిమాండ్ల గురించి వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే మా డిమాండ్లను తీరుస్తామని హామీ ఇచ్చారు. శనివారం నుంచి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ప్లేయర్లు ఆడుతారు. బంగ్లా జట్టు భారత్ పర్యటనకు వెళ్లనుంది. శుక్రవారం నుండి శిక్షణా శిబిరానికి వెళతాం' అని షకిబ్ తెలిపాడు.